డీకే శివకుమార్‌ సీఎం అయ్యేది అప్పుడే?!

Published on Sun, 01/11/2026 - 11:15

సాక్షి,బెంగళూరు: రాష్ట్రంలో సీఎం పదవి మార్పులపై వస్తున్న వదంతుల్ని గృహ నిర్మాణ మంత్రి జమీర్‌ అహ్మద్‌ ఖండించారు. సీఎం సిద్దరామయ్య తరువాత డి కె శివకుమార్‌నే ముఖ్యమంత్రి అవుతారని, అయితే అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత జరుగుతుందని తెలిపారు. లక్ష్మీపురలో నూరాని మసీదు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని విలేకరులతో మాట్లాడారు. 

రాష్ట్రంలో నవంబర్‌ నెల తరువాత రాజకీయ విప్లవం వస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదన్నారు. తమ పార్టీలో ప్రతీది హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2028 వరకు సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగుతారన్నారు. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాల కంటే బాగా అభివృద్ధి పనులు చేశామని, వాటిని చెప్పుకుని ప్రజల ముందుకు వెళతామని తెలిపారు. 

‘మేము ఎప్పటినుంచో చెబుతున్నాం. శివకుమార్‌ ముఖ్యమంత్రి కావాలి, కానీ సిద్దరామయ్య తర్వాత మాత్రమే. అదే మా డిమాండ్‌’. కాంగ్రెస్‌ అనేది శివకుమార్‌ రక్తంలో కాంగ్రెస్‌ ఉంది. మాలో చాలామంది వేరే పార్టీల నుంచి వచ్చాం. కానీ ఆయన రక్తంలో కాంగ్రెస్‌ ఉంది. రక్తాన్ని మార్చలేం’ అని అన్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ నాయకత్వ మార్పు గురించి వస్తున్న వదంతులను ఖండిస్తూ జమీర్‌ స్పందించారు. ‘నవంబర్‌ విప్లవం, డిసెంబర్‌ విప్లవం, ఇప్పుడు జనవరి సంక్రాంతి అని చెప్పిన వారు అర్థం చేసుకోవాలి. ఏమీ జరగదు. హైకమాండ్‌ సిద్దరామయ్యతోనే ఉంది’ అని ఆయన స్పష్టం చేశారు.

మొత్తం మీద, కోలార్‌లో జమీర్‌ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ నేతలు,అధిష్టానం వద్ద సిద్దరామయ్య, శివకుమార్‌ నాయకత్వంపై  స్పష్టత ఇచ్చినట్లైంది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)