Breaking News

‘విశాఖ ఉక్కు ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతారా?’

Published on Tue, 11/18/2025 - 16:49

తాడేపల్లి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా? అంటూ మండిపడ్డారు. ప్లాంట్‌ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉరేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు(మంగళవారం, నవంబర్‌ 18వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన రజిని.. చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఎప్పుడూ ప్రైవేటీకరణే అని విషయం మరోసారి రుజువైందన్నారు. 

‘పేదరిక నిర్మూలన కాదు, పేదలనే నిర్మూలించాలన్నట్టుగా చంద్రబాబు ఆలోచనలు ఉంటాయి. ఎన్నికలకి ముందు ప్లాంటు కోసం పోరాడతామన్నారు. అధికారంలోకి వచ్చాక తెల్ల ఏనుగుతో పోల్చుతున్నారు. వైఎస్ జగన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటూ వచ్చారు. కేంద్రానికి లేఖలు రాయటమే కాదు, సభల్లో కూడా ప్రధాని మోదీని నేరుగా అడిగారు. ప్లాంటు బాగు కోసం జగన్ అన్ని ప్రయత్నాలూ చేశారు. 

కానీ చంద్రబాబు మాత్రం ప్లాంటుకు ఉరి బిగించి ఆ తాడును కేంద్రం చేతిలో పెట్టారు. చంద్రబాబును నమ్ముకుని ఏ వర్గమూ బాగు పడలేదు. రైతులతో సహా ప్రతి వర్గమూ రోడ్డున పడింది.ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికుల పరిస్థితి దారుణంగా తయారయింది. లక్షలాది కార్మికులు, ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కుట్రను చంద్రబాబు ఆపేయాలి. వీలైతే మంచి చేయాలే తప్ప నాశనం చేయొద్దు. వైఎస్సార్ సీపీ కార్మిక పక్షమే. స్టీల్ ప్లాంటును కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అని ఆమె స్పష్టం చేశారు. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)