Breaking News

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది: వైఎస్సార్‌సీపీ

Published on Sat, 10/18/2025 - 22:47

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్‌ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్,  ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. 

ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం,  ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.

కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు.  ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్‌సీపైనా కూడా నోరు మెదపలేదు.  వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్‌ డీఏతో సరిపెట్టేశారు.  నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్‌, పీఆర్‌సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. 

చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్‌ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)