‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి’

Published on Mon, 12/29/2025 - 21:58

తాడేపల్లి :   ఏపీలొ రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయని ధ్వజమెత్తారు వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈరోజు(సోమవారం, డిసెంబర్‌ 29వ తేదీ) పార్టీ లీగల్‌ సెల్‌ నేతలతో ఆయన జూమ్‌ కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై చర్చించారు.  దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ..  ‘ఏపీలో రాజకీయ వేధింపులు పరాకాష్టకు చేరాయి.  వైఎస్ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడాన్ని తట్టుకోలేక పార్టీ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడుతున్నారు. నిరంకుశ పాలన, నియంత పాలనకు ఇంతకు మించిన నిదర్శనం ఉంటుందా?, చంద్రబాబు, లోకేష్‌లు బరితెగించి వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వంతపాడుతున్న పోలీసుల చర్యలను ధీటుగా ఎదుర్కుందాం.

చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేద్దాం. క్యాడర్‌కు అండగా నిలుద్దాం. రెడ్ బుక్‌ రాజ్యాంగంపై గట్టిగా పోరాడుతున్న పార్టీ లీగల్‌ సెల్‌కు అభినందనలు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీకి పొట్టేళ్ళ తలలతో హారం వేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఈ మధ్య ఒకరిపై రాజద్రోహం కేసు పెట్టారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?, 

కమ్యూనిస్ట్ నాయకుడు హక్కుల కోసం పోరాడితే పీడీ యాక్ట్ పెట్టారు. జగన్‌  మరింత పట్టుదలతో పార్టీని నడిపిస్తున్నారు. ప్రతి ప్రజాసమస్యపై ముందుండి పోరాటం చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. కూటమి ప్రభుత్వ దమనకాండను ధీటుగా ఎదుర్కొందాం. వైఎస్సార్సీపీ సైన్యం పోరాట పటిమతో దూసుకెళుతుంది’ అని స్పష్టం చేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)