Breaking News

అది ‘విద్యా మీట్‌’ కాదు..దగా మీట్‌: మేరుగ నాగార్జున

Published on Sat, 12/07/2024 - 13:41

సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్‌7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.

‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్‌ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? 

రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్‌లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.

ఇరవై మంది వైస్‌ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక పిల్లల భవిష్యత్తును నాశనం

ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..?

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు