Breaking News

చంద్రబాబూ ఇకనైనా మేలుకో! : వైఎస్‌ జగన్‌

Published on Tue, 02/17/2026 - 23:36

సాక్షి, అమరావతి: ‘మదనపల్లె పరిధిలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి, ఆపై హత్యచేసి, నీటి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన మీకు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా?’ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పు­లు చెరిగారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు కాపాడలేకపోయా­రని నిలదీశారు. ఇకనైనా మేలుకుని తక్షణమే శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టి మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించి.. వారి ప్రాణాలు కాపాడటంపై దృష్టి పెట్టాలని చంద్రబాబుకు హితవు పలికారు. 

ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్య­మం ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్ట్‌ చేశారు. ‘నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో తొమ్మిదేళ్ల గిరిజన బాలిక, వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో మూడేళ్ల బాలిక, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారి లైంగిక దాడికి గురై, ఆపై హత్యకు గురయ్యారు. ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక బాలికలు, మహిళలపై ఎన్నో దారుణమైన  ఘటనలు జరిగాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభు­త్వం ఈ ఘటనలను తేలిగ్గా తీసుకుందనేది వాస్తవమన్నారు. ఎల్లో మీడియాలో హడావుడి ప్రకటనలు చేయడం, అనంతరం ఆ విషయాన్ని వదిలేయడం సహజంగా మారిందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రశ్నించిన వారు మాజీ మంత్రులైనా వారి ఇళ్లమీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించి, ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నాలు చేయించడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్ష­ణ కల్పించడంపై చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. శాంతిభద్రతలపై హోం మంత్రి బాధ్యత వహించరని, చంద్ర­బాబు కుమారుడు ఆయన శాఖలను నీరుగారుస్తూ.. అందరి శాఖల్లో వేలుపెడతారని విమర్శించారు. 

ఏ మంత్రీ దేనికీ బాధ్యత వహించరన్నారు. ‘ముఖ్యమంత్రిగా మీకు ప్రచారం తప్ప మరేమీ పట్టదు. సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారి పనిగా మారిపోయింది. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టిపెడతారు?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ‘చంద్రబాబు సృష్టించిన పొలిటికల్‌ గవర్నెన్స్‌తో, రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్‌ ఆర్డర్‌ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు రక్షణ ఎక్కడ నుంచి లభిస్తుంది? 

మీ పాలనా వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు, మహిళలు బలైపోవాలా? ప్రతిరోజూ భయంతో బతకాలా? పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే, బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లకు పంపుతున్నారు’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఓ టీడీపీ నాయకుడు మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం చేస్తే కేసు కట్టి అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులు స్టేషన్‌ చుట్టూ తిప్పి, చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైళ్లకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారని వెల్లడించారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని వైఎస్‌ జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)