Breaking News

లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?: వైఎస్‌ జగన్‌

Published on Tue, 06/24/2025 - 18:47

తాడేపల్లి:  చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా చేసిన మోసంపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకులు చేపట్టిన ‘యువత పోరు’ సక్సెస్‌ కావడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.  

‘యువత పోరు’ పేరిట రోడ్డెక్కి తమ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కళ్లు తెరిచేలా బ్రహ్మాండంగా విజయవంతం కావడంలో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నిరసన కార్యక్రమంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై నిన్న(సోమవారం) నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జిని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైఎస్‌ జగన్‌.

లెక్కలు వేసి మరీ బాండ్లు ఇచ్చారు కదా.. ఇప్పుడేమైంది?
‘నిరుద్యోగ భృతి ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి వివిధ రకాలుగా బాండ్లు పంచారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు, యువకులు ఉన్నారో అంతమందికీ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3వేల చొప్పున ఇంత వస్తుందని లెక్కలు వేసి మరీ, బాండ్లు ఇచ్చారు. చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే ఆ మేరకు జూన్‌ -2024 నుంచి వారి వారి ఖాతాల్లో జమ అవుతుందని, ప్రజలకు బాండ్లు రాసిమరీ ఇచ్చారు. టీడీపీ అధికార గెజిట్‌ ఈనాడు దినపత్రికలో రాష్ట్రంలో ఉపాధికోసం, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు కోటిన్నరపైనే ఉన్నారని రాస్తే, మీ మేనిఫెస్టో, మీరు ఇంటింటికీ పంచిన బాండ్ల ప్రకారం నెలకు రూ.3వేల చొప్పున ఈ ఏడాది కాలంలో మీరు  ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు?  ఒక్కరికీ ఇవ్వకపోగా, ఈ ఏడాది మళ్లీ ఎగరగొట్టే మోసానికి దిగారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మాట ఏమైంది?
మరోవంక 2024 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అదే సంవత్సరం 2024లో చెల్లింపులు చేయాలి. ఎన్నికల కారణంగా అది నిలిచిపోయింది. అప్పటినుంచి ఈ జూన్‌-2025వరకూ 6 త్రైమాసికాలుగా మొత్తంగా రూ.4,200 కోట్లు పెండింగ్‌. ఇందులో ఇచ్చింది  కేవలం రూ.750 కోట్లు. వసతి దీవెన కింద ఏప్రిల్‌-2024న చెల్లించాల్సిన ఒక విడత, ఈ ఏడాది ఏప్రిల్-2025 లో  చెల్లించాల్సిన మరో విడత కలిపి రూ.2,200కోట్లు పెండింగ్‌. మొత్తంగా రూ.6,400 కోట్లకు గానూ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మీరు ఇవ్వకపోవడంతో ఇవాళ విద్యార్థులు చదువులు మానుకుని, పనులకు పోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

ఇకనైనా తప్పులు సరిదిద్దుకోండి..
చంద్రబాబుగారూ మీరు చేయాల్సింది చేయకుండా, ఎగరగొట్టినందుకు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నంచేస్తున్నారు. వీళ్లంతా చేసిన తప్పేమిటి? కేవలం కలెక్టర్‌ను కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడం తప్పా? మీరు ఇస్తామన్న వాటికోసం కూడా డిమాండ్‌ చేయడం తప్పా? మీ రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనకు నిన్న నరసరావుపేటలో జరిగిన ఘటన నిదర్శనం కాదా? రోజురోజుకూ మీ అబద్ధాలు, మీ మోసాలు, మీ దౌర్జన్యాలు, మీరు చేస్తున్న పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)