Breaking News

జేపీసీలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

Published on Fri, 12/20/2024 - 12:24

ఢిల్లీ : జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. జమిలి బిల్లుల కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ జేపీసీ కమిటీలో రాజ్యసభ నుంచి 12మందికి చోటు కల్పించింది. ఆ 12మందిలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని  జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.  

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నిక బిల్లును)ను లోక్‌సభ శుక్రవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇప్పటికే మంగళవారం దిగువ సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టగా.. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందని విపక్షాలు ఆరోపించాయి. సంయుక్త పార్లమెంటరీ కమిటీకి (జేపీసీ) పంపాలని డిమాండ్‌ చేయడంతో లోక్‌సభ జేపీసీకి పంపింది. 

మరోవైపు లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది.. మొత్తం 31 మందితో కూడిన జేపీసీ జాబితాను లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. పీపీ చౌధరిని ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించారు.

కమిటీలో అనురాగ్‌ ఠాకూర్‌, అనిల్‌ బలూనీ, సంబిత్‌ పాత్రా, శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌షిండే, సుప్రియా సూలే, ప్రియాంక గాంధీ, మనీష్‌ తివారీ, సెల్వ గణపతి తదితరులకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ నుంచి), బాలశౌరి(జనసేన), హరీష్‌ బాలయోగి(టీడీపీ), సీఎం రమేష్‌(రాజ్యసభ నుంచి)లకు జేపీసీలకు అవకాశం ఇచ్చారు.

జేపీసీలో YSRCP ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)