Breaking News

సీఈసీని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. ఓట్ల తొలగింపుపై భేటీ

Published on Mon, 08/28/2023 - 18:09

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ హయాంలో ఏపీలో జరిగిన ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఈసీని కలిశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏపీలో ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈసీతో భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీస్థాయిలో ఓట్ల అవకతవకలకు పాల్పడి దొంగ ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు మేము అవకతవకలకు పాల్పడుతున్నామని ఆయన అంటుంటే దొంగే దొంగ అన్నచందాన ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో 2014 నుంచి నమోదైన దొంగ ఓట్లపై విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. 

2014-19 వరకు బాబు పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారని, ఆ లెక్క సంగతి తేల్చాలని డిమాండ్ చేస్తూనే దొంగ ఓట్ల ఏరివేత బాధ్యత పూర్తిగా ఈసీదేనని అన్నారు. వెంటనే ఓటరు కార్డులను ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒకరికి ఒక్క ఓటు మాత్రమే ఉండాలని.. రాబోయే ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకతతో జరిపించాలని ఈసీని కోరినట్టు స్పస్టం చేశారు. ఈ దఫా అత్యంత పారదర్శకతతో ఓట్ల నమోదు జరిగిందని 2019లో 3,98,34776 ఓట్లు ఉంటే, ఇప్పుడు 3,97,96,678 ఓట్లు ఉన్నాయని తెలిపారు. 

ఏపీలో ఎక్కడా దొంగ ఓట్ల నమోదు జరగలేదని అన్నారు. ఎన్నికలకు నిజమైన ఓటర్ల జాబితా ఉండాలన్నదే మా ఉద్దేశమని స్పష్టం చేశారు. చంద్రబాబు సేవా మిత్ర, మై టీడీపీ ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేయిస్తున్నారని, టీడీపీ ఓటరు ప్రొఫైలింగ్ ఆపాలని ఈసీని కోరినట్టు తెలిపారు. దీనిపై ఈసీ ఫుల్ కమిషన్ ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్‌-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)