Breaking News

‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’

Published on Thu, 03/05/2026 - 15:48

విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్‌ చేశారు.  అన్ని మతాలను గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంటే, అచ్చెన్నాయుడు మాత్రం కులమతలాను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మండిపడ్డారు. ఈరోజు(గురువారం, మార్చి 5వ తేదీ) శాసనమండలి సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. 

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ.. ‘ అచ్చెన్నాయుడితో మాట్లాడిస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. రేపు వ్యవసాయం పై జరగాల్సిన చర్చను డైవర్ట్ చేయడం కోసమే ఇలా చేస్తున్నారు. అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. బీఆర్ నాయుడిని తొలగిస్తారా లేదా?’ అని ప్రశ్నించారు.

మరో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. కులమత రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటు. మమ్మల్ని కాదు.. చంద్రబాబుని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించాలి. వెనక్కి పంపించిన ట్యాంకర్లు ఎందుకు వాడారో చంద్రబాబుని అడగాలి.

ఇందాపూర్ కు ఎందుకు నెయ్యి టెండర్లు ఇచ్చారో చంద్రబాబుని అడగాలి. దేవుడి సొమ్మును ఎందుకు పక్కదారి పట్టించారని అడగాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ తిరుపతి లడ్డూ పై అపవిత్రమైన మాటలు మాట్లాడింది చంద్రబాబు. లడ్డు పై మా ప్రశ్నలకు దేవాదాయ శాఖ మంత్రి సమాధానం చెప్పలేకపోయారు. కల్తీ జరిగింది మీ హయాంలోనే. వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్లు వాడింది మీ హయాంలోనే. ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కు దోచిపెట్టడానికే నెయ్యి ధరలు పెంచారు.  దీని వెనుక పెద్ద ఆర్ధిక దోపిడీ కుట్ర ఉంది’ అని మండిపడ్డారు. 

ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ లడ్డు పై చర్చను పూర్తిగా కొనసాగనివ్వలేదు. లడ్డు పై మా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ కల్తీ నెయ్యి తిరుమలకు వెళ్తోంది. తమ బండారం బయటపడుతుందని వాస్తవాలను రానివ్వడం లేదు. తిరుమల దర్శనం చేసిన తర్వాతే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా దేవదేవుడిని దర్శించుకున్నారు’ అని స్పష్టం చేశారు. 

చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతీసారీ తిరుమలకు కల్తీ నెయ్యి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)