Breaking News

‘హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పై అనుమానులున్నాయ్‌’

Published on Tue, 04/08/2025 - 15:55

తాడేపల్లి:  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తాజా ఘటనే సాక్ష్యమని వైఎస్సార్‌సీపీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఏపీలో రోజురోజుకీ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. తాము జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనకు సంబంధించి రెండు రోజులు ముందుగానే సమాచారమిచ్చామని, ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో అర్థమవుతుందని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మంగళవారం మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. రామగిరిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోయింది. ఇది మీ వైఫల్యం కాదా.. అసలు హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. 

వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించారు
దేశంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్‌మోహన్‌రెడ్డి. పోలీసులు కనీస భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ భద్రత కుదించారు. ఆయన ఇంటివద్ద భద్రత కుదించారు. జగన్ పర్యటనల్లో సరైన భద్రత కల్పించడం లేదు. కూటమి నేతల ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్... పోతుంటాయ్ వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు

మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుంది. కూటమి నేతల మాటలు విని తప్పులు చేసే వారిని విడిచిపెట్టం. ఇటీవల జగన్ పర్యటనల్లో భద్రత లోపం తేటతెల్లమైంది. మా కార్యకర్తలే రోప్ పార్టీగా మారి జగన్‌కు భద్రత కల్పించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యయుతమైన పాలన ఏపీలో కొనసాగడం లేదు వైఎస్సార్‌సీపీ వారిపై  దాడులు జరుగుతున్నాయ్.. జగన్ భద్రత పై కేంద్రం జోక్యం చేసుకోవాలి. జగన్‌కు సరైన భద్రత కల్పించాలి. 

వైఎస్ జగన్ పర్యటనకు కనీస భద్రత కరువు

అభిమానుల ముసుగులో అసాంఘికశక్తులు
హెలీకాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినడం పైన అనేక అనుమానాలున్నాయ్. మా పార్టీ కార్యకర్తల ముసుగులో ప్రత్యర్ధి పార్టీ వర్గీయులే ఈ పని చేసుంటారని మాకు అనుమానం  జగన్  భద్రత పై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యత తీసుకోవాలి.  మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. పోలీసులు నిస్పక్షపాతంగా పనిచేస్తే శాంతిభద్రతలు ఎందుకు లోపిస్తాయి. మేం పోలీసులందరినీ అనడం లేదు

పచ్చచొక్కాలేసుకున్న అధికారుల గురించి మాత్రమే మేం మాట్లాడుతున్నాం. తప్పుచేసిన వారిని మాత్రమే మేం చట్టం ముందు నిలబెడతామంటున్నాం. తప్పుచేసిన వారు తప్పించుకుపోలేరు గుర్తుంచుకోండి’ అంటూ హెచ్చరించారు లేళ్ల అప్పిరెడ్డి

ఇది చదవండి:

మళ్లీ అదే నిర్లక్ష్యం.. జగన్‌ పర్యటనకు కనీస భద్రత కరువు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)