Breaking News

‘నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిది’

Published on Tue, 03/08/2022 - 21:38

సాక్షి, అమరావతి: సర్పంచ్‌లుగా నామినేషన్లు వేయటానికి వెళ్లిన నలుగురిని చంపిన చరిత్ర అచ్చెన్నాయుడిదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నన్ను చంపుతానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అర్జంటుగా నన్ను అరెస్టు చేయమని‌ చంద్రబాబు, అచ్చెన్నాయుడు గోల చేస్తున్నారు. ఆ వెంకటరావు అనే వ్యక్తి ని నేను ఇంతవరకు చూడలేదు. అతను టీడీపీ సీనియర్ కార్యకర్త. అచ్చెన్నాయుడు.. ఓటమి తప్పదని ఇప్పుడు నా మీద ఆరోపణలు చేస్తున్నారని’’ దువ్వాడ దుయ్యబట్టారు.

చదవండి: ఈసారి ఆ 23 సీట్లు కూడా రావు: ఎమ్మెల్సీ పోతుల సునీత

‘‘నన్ను చంపమని అచ్చెన్నాయుడు ఈ వెంకటరావుతో ఒప్పందం కుదుర్చున్నాడు. ఈ విషయం బయట పడటంతో అచ్చెన్నాయుడే అతన్ని చంపించాడు. అసలు విషయం బయటకు రాకముందే నన్ను అరెస్టు చేయమని డిమాండ్ చేయటం వెనుక ఉద్దేశం ఏంటి?. ఈ కేసులో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌లను అరెస్టు చేసి విచారణ జరపాలి. నామీద ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్నారు. కానీ మేము‌ పట్టించుకోలేదు. టీడీపీ పని అయిపోయింది. మళ్ళీ సీఎం జగనే కావాలని జనం కోరుకుంటున్నారని’’ దువ్వాడ అన్నారు.

‘‘ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. వారి కార్యకర్తల్లో ఉత్సాహం కోసం అలా చెప్పుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ వైఎస్‌ జగనే కావాలనుకుంటున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎంత హడావుడి చేసినా జనం విశ్వసించే పరిస్థితి లేదని’’ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. 
 

Videos

గ్యాస్ తాగుతూ బతుకుతున్న ఓ వింత మనిషి

మాధవి రెడ్డి పై అంజాద్ బాషా ఫైర్

ఒంటరిగా ఎదుర్కోలేక.. దుష్ట కూటమిగా..!

జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట

నేడు యాదగిరి గుట్ట, పోచంపల్లిలో అందాల భామల పర్యటన

శత్రు డ్రోన్లపై మన భార్గవాస్త్రం

ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు

మద్యం కేసులో బాబు బేతాళ కుట్ర మరోసారి నిరూపితం

సచిన్, విరాట్ తర్వాత నంబర్-4 పొజిషన్ ఎవరిది?

ఆపరేషన్ సిందూర్ తో మరోసారి లెక్క సరిచేసిన భారత్

Photos

+5

#MissWorld2025 : బతుకమ్మలతో ముద్దుగుమ్మలకు ఆత్మీయ స్వాగతం (ఫొటోలు)

+5

ఈ తీపి గుర్తులు మరిచిపోలేను‌.. ఫోటోలు విడుదల చేసిన శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

జాతరలో నిర్లక్ష్యం గంగమ్మ జాతరకు భారీగా భక్తులు..(ఫొటోలు)

+5

వరంగల్‌ : కాకతీయ వైభవాన్ని చూసి మురిసిన విదేశీ వనితలు (ఫొటోలు)

+5

Miss World2025: రామప్ప ఆలయంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

+5

Cannes Film Festival 2025: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన అందాల తారలు.. ఫోటోలు

+5

గంగమ్మ జాతరలో కీలక ఘట్టం..విశ్వరూప దర్శనంలో గంగమ్మ (ఫొటోలు)

+5

హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)