Breaking News

‘మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక లోకేష్‌ అబద్ధాలు’

Published on Sun, 03/23/2025 - 19:33

నెల్లూరు: శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుడగడునా ఎండగట్టాం. 

మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్‌ అబద్ధాలు చెప్పారు.  బీసీల బలవంతపు రాజీనామాలపై  సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్‌ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై సంతకం పెట్టి.. ఇప్పటివరకూ దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.  గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తోంది.

వైఎస్సార్‌సీపీలో ఉండే ఏ ఒక్కరికి రాజకీయ స్వార్థం లేదు. మా నాయకుడు వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎం చేసుకోవడమే మా అందరి లక్ష్యం. నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూసినా.. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పేద ప్రజలకు వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా సరిగ్గా అమలు చేయడం లేదు’ అని ధ్వజమెత్తారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)