Breaking News

‘ చర్చకు రమ్మంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?’

Published on Sat, 02/28/2026 - 16:57

తాడేపల్లి : వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేట్లపాలెం ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రశేఖర్‌.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన కోరారు.  ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్‌.. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఇంకా లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. 

లడ్డూ, ఇందాపూర్ విషయాలపై చర్చకు రమ్మంటే ఎందుకు రావటం లేదు?, ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?, ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వటం వెనుక స్కాం ఉంది. 900 కిమి దూరంలో ఉన్న ఇందాపూర్ కు కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు?, వైష్ణవి డెయిరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంబంధం ఉంది. ఆయనకు చెందిన సంగం డెయిరీతో వైష్ణవి డెయిరీకి‌ సంబంధం ఉంది. టీటీడీ నిధులను కొల్లగొట్టటానికే అక్రమంగా కాంట్రాక్టు పొందారు. మూడుసార్లు టెండర్ పిలిచి ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. తర్వాత సంగం డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చారు. అసలు సంగం డెయిరీకి ఆవు నెయ్యి సరఫరా చేసే అవకాశం లేదు. కానీ నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?, లోకేష్ రెడ్ బుక్ కు మా పార్టీలోని కుక్కలు కూడా భయపడవు. రెడ్ బుక్ వలనే కూటమి ప్రభుత్వం అభాసుపాలయింది’ అని ధ్వజమెత్తారు.

ఇక ఏపీలో సంక్షేమం పేరుతో వృద్ధులు, దివ్యాంగులు కడుపు కొడుతున్నారని విమర్శించారు. వారికి నెలకు రూ. 25  వేల చొప్పన పెన్షన్లు కట్‌ చేస్తున్నారు. చంద్రబాబు ప్రతీనెలా మీటింగ్‌ పెట్టి చేస్తున్నది ఇదే. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారు. మండలి చైర్మన్‌ని ఒక మంత్రి డిక్టేట్‌ చేయడం బాధాకరం’ అని మండిపడ్డారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)