Breaking News

‘క్యాబినెట్‌లో వ్యతిరేకించకుండా ఇలా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి?’

Published on Mon, 12/29/2025 - 18:19

రాయచోటి:  రాయచోటి జిల్లా కేంద్రాన్ని కొనసాగించకుంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటు పొడవడమేని, అది మరోసారి రుజువైందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రాన్ని రద్దు అంశం కూటమి కక్షలో భాగమేనన్నారు. క్యాబినెట్‌లో  వ్యతిరేకించకుండా కన్నీరు కారిస్తే ఉపయోగం ఏంటి? అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీరుపై మండిపడ్డారు శ్రీకాంత్‌రెడ్డి.  జిల్లా కేంద్రం కోసం,జిల్లా కోసం పోరాటాలు కొనసాగిస్తామని, రేపు(మంగళవారం) రాయచోటిలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామన్నారు శ్రీకాంత్‌రెడ్డి. 

కాగా, రాయచోటి ప్రజలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం  చేశారు సీఎం చంద్రబాబు. గత ఎన్నికల సమయంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని మార్చి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసంపై రాయచోటి ప్రజలు మండిపడుతున్నారు.

రాయచోటి జిల్లా కేంద్రం రద్దు అంశానికి సంబంధించి  ఏపీ కేబినెట్‌లో హై డ్రామా సాగింది. రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై  మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నోరు విప్పలేదు. వ్యతిరేకించారా..? లేదా..? అంటూ రాంప్రసాద్ రెడ్డిని మీడియా ప్రశ్నించగా.. ఆయన ముఖం చాటేసి వెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైకుంఠ ఏకాదశి వేళ అన్నమయ్యకు ఘోర అవమానమే జరిగింది.

రాయచోటి జిల్లా కేంద్రం ఎత్తి వేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాజంపేటని కడప జిల్లాలో కలిపి.. మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైల్వే కోడూరుని తిరుపతి జిల్లాలో కలపాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లంటూ లీకులు  ఇస్తూ.. డ్రామాను రక్తి కట్టించారు.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)