Breaking News

చంద్రబాబువన్నీ డ్రామాలే.. 

Published on Fri, 05/05/2023 - 13:54

సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్‌ రావు, ఎమ్మెల్యేలు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్‌ అయ్యారు. 

మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. 

ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్‌ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్‌ వన్‌గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్‌ అయ్యారు.

చదవండి:  రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)