Breaking News

‘పక్కా ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది’

Published on Sun, 04/14/2024 - 11:51

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో అర్థం కాలేదు. నా కంటికి కూడా దెబ్బ తగలడంతో విపరీతంగా నొప్పి వచ్చిందన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. సీఎం జగన్‌పై దాడి ముమ్మాటికీ చంద్రబాబు పనే అని వెల్లంపల్లి చెప్పుకొచ్చారు. 

కాగా, వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు తగిలిన వెంటనే నాకు కూడా గాయమైంది. ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదు. నాకు కనుగుడ్డుపై ర్యాష్‌ అయ్యింది. ఇప్పుడు కూడా కంటి నొప్పి ఉంది. సీఎం జగన్‌ తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. పోలీసులు, ఎన్నికల కమిషన్‌ ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టాలి.  

చంద్రబాబు నీచమైన రాజకీయం చేస్తున్నాడు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు చంపించాడు. సీఎం జగన్‌పైన ఈరోజు ఇలా కుట్ర చేశారు. సిగ్గులేకుండా లోకేష్, అచ్చెన్నాయుడు, చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం డ్రామాలాడే అలవాటు చంద్రబాబుదే. టీడీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. సీఎం జగన్‌పై దాడిని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై దాడి జరిగింది. దాడి చేసిన వెంటనే బాబు మార్క్‌ రాజకీయం మొదలుపెట్టారు. సీఎం జగన్‌పై దాడిని కూడా డ్రామా అనడం చంద్రబాబు నైజం. విచారణ వేగంగా జరుగుతుంది.. వాస్తవాలు బయటకి వస్తాయి. ఈ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్‌ వెంటనే దర్యాప్తు చేయాలన్నారు. 

మరోవైపు, సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే రోజా నిరసనలు చేపట్టారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు వస్తున్న ఆదరణ చూడలేకే చంద్రబాబు దాడులు చేయించారు. చంద్రబాబును తక్షణమే అరెస్ట్‌ చేయాలి. పవన్‌ కల్యాణ్‌ కుట్రలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఇక, ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలు సరికాదు. తన గెలుపు కోసం ఎదుటి వ్యక్తిని చంపాలనుకోవడం సిగ్గుచేటు. ప్రతిపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)