Breaking News

రంగా పేరు తలిచే అర్హత టీడీపీకి లేదు

Published on Wed, 07/05/2023 - 05:26

చిట్టినగర్‌ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసి­రిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్‌ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్‌ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు.

వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్‌ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.  

రంగా వ్యక్తి కాదు ఒక శక్తి.. 
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్‌ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. చంద్రబాబు పల్ల­కిని పవన్‌ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్‌ కళ్యాణ్‌ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్‌ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు.

ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మా­ట్లా­డుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు.

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి ­రంగా ఒక ఐకాన్‌ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా స­త్క­­రించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్త­కాన్ని ఆవిష్క­రించారు. ఎపీఎండీసీ చైర్మన్‌ పుణ్య­శీల, వైఎస్సా­ర్‌­­సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్ర­మండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)