Breaking News

‘జగన్‌ అంటే చంద్రబాబు ఎంత భయపడుతున్నారో అనడానికి ఇదే నిదర్శనం’

Published on Sun, 08/10/2025 - 17:31

తాడేపల్లి:   వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి సీఎం చంద్రబాబు ఎంత భయపడిపోతున్నారో  ప్రస్తుతం ఓ చిన్న ఎన్నిక కోసం జరుగుతున్న పరిణామాలను చూస్తేనే అర్ధమవుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 10వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్‌.. ‘ చిన్న ఎన్నికకు జగన్ అంటే సీఎం చంద్రబాబు ఎంత భయపడుతున్నారో జరుగుతున్న పరిణామాలే చెబుతున్నాయి. టీడీపీ నేతల దాడిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ యాదవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. 

మా నేతలపై దాడి చేసినా ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేయలేదు. తప్పుడు ఫిర్యాదుతో మా పార్టీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని చట్టాలను కూటమి ప్రభుత్వంలోని నేతలు గౌరవించటం లేదు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం. దాడులకు గురైన వారిపైనే రిటర్న్ అట్రాసిటీ కేసులు పెట్టడం దుర్మార్గం. పులివెందుల జెడ్పీటీసీ సెగ్మెంట్ లో గెలిచి ఆధిపత్య రాజకీయాలు చూపించాలనుకుంటున్నారు చంద్రబాబు. ఎన్నికలు జరుగుతుంది వైఎస్సార్‌సీపీకి కూటమికి మాత్రమే కాదు. వైసీపీకి పోలీసులకు.. వైసీపీకి ఎన్నికల సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. ఎన్ని ఘటనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది..

సీఎం స్థాయిలో కూర్చున్న వ్యక్తి జెడ్పీటీసీ ఎన్నికను పర్యవేక్షించటం చంద్రబాబు హయంలోనే మొదలైంది..డీజీపీ కార్యాలయానికి వెళ్తే పోలీసులను పెట్టి ఆపిస్తున్నారు. డీజీపీ రాష్ట్రానికా.. టీడీపీ కా?, ప్రజా ప్రతినిధులు వస్తే ఔట్ వార్డులో ఇచ్చి వెళ్ళమంటారా?, ఎస్సీ నేతలమని మాపై డీజీపీ వివక్ష చూపిస్తున్నారు. కనీసం ఒక్క అధికారి కూడా రాలేదు. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్ళినా.. డీజీపీ కార్యాలయానికి వెళ్ళినా ఇదే తంతు జరుగుతుంది. చంద్రబాబు దృష్టిలో పడాలని అధికారులు పోటీలు పడుతున్నారు. మార్చిన పోలింగ్ కేంద్రాలు యధాస్థానంలో ఉంచాలి. మేము ఓడిపోతామనే భయంతో మాట్లాడటం లేదు.ఎన్నికల సంఘానికి ఇది శల్య పరీక్ష అని గుర్తుంచుకోవాలి. మా నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి. హైకోర్టు ఆదేశాలు పాటించాలి’ అని సూచించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)