Breaking News

‘ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని సిట్‌ సేకరించలేదు’

Published on Sat, 07/26/2025 - 17:59

తాడేపల్లి : లేని మద్యం కేసుని సృష్టించి సిట్‌ అధికారులు వేధింపులకు దిగారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు విమర్శించారు.  ఆ కేసులో ఇప్పటివరకూ  సిట్‌ ఒక్క ఆధారాన్ని కూడా సేకరించకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈరోజు(శనివారం, జూలై 26) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన టీజేఆర్‌ సుధాకర్‌ బాబు.. ‘ బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు రాబోతున్న సమయంలో మళ్ళీ సోదాలు అంటూ డ్రామా చేస్తోంది. 

అరెస్టు సమయంలో 8 గంటల పాటు సోదాలు, విచారణ చేసిన సిట్ అధికారులు మళ్ళీ సోదాలు చేయటమంటే ఇది కుట్ర కాక మరేంటి?, బాలాజీ గోవిందప్ప అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్‌కు డైరెక్టర్‌. అలాంటి డైరెక్టర్ ని అక్రమ కేసులో ఇరికించారు. ఇలాగైతే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు ఎలా వస్తారు?, గౌరవ కుటుంబం నుండి వచ్చిన బాలాజీ గోవిందప్పని వేధించటం ద్వారా ఏం సాధించదలచుకున్నారు?, పోలీసు వ్యవస్థని పూర్తిగా తన సొంతం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 

బాలాజీ గోవిందప్పని ఇప్పటికే 75 రోజుల నుండి జైల్లో పెట్టారు. పారిశ్రామిక వేత్తలపై దాడులు చేయటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ కొనసాగాలన్నా బెదిరించి కప్పం వసూలు చేస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు పరిశ్రమలను ఎలా బెదిరిస్తున్నారో అందరికీ తెలుసు. వీరి దెబ్బకు తట్టుకోలేక పరిశ్రమలు పరారవుతున్నాయి. దీనిపై చర్చకు మేము సిద్దం, మీరు సిద్దమా?, నియోజకవర్గంలో నుండి గ్రానైట్ వాహనాలు వెళ్తుంటే వాటిని ఆపి కమీషన్లు లాక్కుంటున్నారు. మద్యం కేసులో సిట్ ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. జగన్ అత్యంత పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశారు’ అని స్పష్టం చేశారు.

అక్రమ మద్యం కేసులో మరో నాటకానికి తెరతీసిన SIT

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)