Breaking News

‘ఆస్తులపై అందుకే షర్మిల దుష్ప్రచారం’

Published on Sat, 04/05/2025 - 15:04

అనంతపురం, సాక్షి: ఆస్తుల పంపకాల విషయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై షర్మిల చేస్తున్న‌ ఆరోపణలను మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి ఖండించారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఆమెను తెరపైకి తీసుకొచ్చారని అన్నారాయన. హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఈ నెల 8వ తేదీన  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన  ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు  వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం భేటీ నిర్వహించారు. అనంతరం సతీష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

‘షర్మిల చెబుతున్న ఆస్తులు దర్యాప్తు సంస్థల నియంత్రణ లో ఉన్నాయి. ఆ ఆస్తులు ఇవ్వలేదంటూ వైఎస్ షర్మిల దుష్ర్పచారం చేస్తున్నారు. జగన్ - షర్మిల మధ్య కుదిరిన ఒప్పందం క్లియర్‌గా ఉంది. ఈనాడు ద్వారా కావాలనే జగన్‌పై దుష్ర్పచారం చేస్తున్నారు. టీడీపీ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది. ప్రజలను డైవర్ట్‌ చేసేందుకే ఆమెను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని సతీష్ రెడ్డి అన్నారు.

టీడీపీ నేతల డైరెక్షన్‌లోనే పోలీసులు
టీడీపీ నేతల డైరెక్షన్ లోనే పోలీసులు పనిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఎస్పీ ఆదేశాల కన్నా టీడీపీ ఎమ్మెల్యే మాటకే సీఐలు, ఎస్సైలు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను  కూటమి ప్రభుత్వం నిర్వర్యం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

లింగమయ్య హత్యను ఖండిస్తున్నాం
వైఎస్సార్ సీపీ నేత కురబ లింగమయ్య దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. కురబ లింగమయ్య హత్యకు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తగిన మూల్యం చెల్లించోకతప్పదన్నారు. టీడీపీ హింసా రాజకీయాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తామన్నారు శంకర్ నారాయణ.

పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపించాలా.. షర్మిల ఆరోపణలపై సతీష్ రెడ్డి కౌంటర్..

పరిటాల సునీతవి హింసా రాజకీయాలు
రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత హింసా రాజకీయాలు తీవ్రమవుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎంపీపీ ఎన్నికల్లో బలం లేదంటూనే హింసకు పాల్పడ్డారని విమర్శించారు తోపుదుర్తి. ఈనెల 8వ తేదీన వైఎస్ జగన్ పాపిరెడ్డిపల్లిలో పర్యటిస్తారన్నారని, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

హత్యకు గురైన వైఎస్సార్ సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారని ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే లింగమయ్య హత్య జరిగిందని,. టీడీపీ ఎ‍మ్మెల్యే పరిటాల సునీత రాజకీయ హత్యలను ప్రేరిపిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాల ఆగడాలపై నిరంతర పోరాటం చేస్తామన్నారు తోపుదుర్తి

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు