Breaking News

‘ మేం బెదిరించి ఉంటే రికార్డింగ్‌ చూపించండి’

Published on Mon, 08/04/2025 - 21:41

వైఎస్సార్‌ జిల్లా:  ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్‌ గురించి టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ బీటెక్‌ రవి, శ్రీనివాసులురెడ్డి, ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్‌లో ఏవో మాట్లాడుతున్నారు. నిన్న పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డిని ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. 

నేడు అతనితో మేము బెదిరించినట్లు పోలీసులకు పిర్యాదు చేయించారు. జగన్ గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదం. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనే వ్యక్తి వైఎస్ జగన్. నూటికి నూరు పాళ్లు ప్రజాస్వామ్య యుతంగా ఎన్నిక జరగాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్. ఉప మండలాధ్యక్షుడ్ని  లోబరుచుకుని ఇలా చేస్తున్నారు. 

ఎవరు బెదిరించారు అనేది రికార్డింగ్ చేసింది చూపండి. మేము పదవి ఇచ్చిన వారు ఇతర పార్టీలోకి వెళ్తుంటే మాట్లాడటం తప్పేలా అవుతుంది. బెదిరింపు వేరు..బుజ్జగింపు వేరు. మా పార్టీ నేతను మా మేము బుజ్జగించే ప్రయత్నం చేశాము. నిజంగా బెదిరించి ఉంటే రికార్డింగ్ చూపండి. ఒక దురుద్దేశంతో ఇలా చేసి బెయిల్ పై ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చెప్తున్న ఉప మండలాధ్యక్షుడు మా అభ్యర్థి నామినేషన్ లో కూడా పాల్గొన్నాడు. మీరు అతన్ని లోబరుచుకుని ఇలా చేయడం మీ నైజానికి నిదర్శనం’ అని మండిపడ్డారు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)