Breaking News

‘దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు బేతాళ కథలు వినిపిస్తున్నారు’

Published on Wed, 01/21/2026 - 16:54

తాడేపల్లి : దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లు బేతాళ కథలు వినిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ విమర్శించారు. వారు తెచ్చే పరిశ్రమల సంగతి ఏమో కానీ పబ్లిసిటీ మాత్రం పీక్స్‌లో ఉందని మండిపడ్డారు. పనిలో పనిగా ట్రంప్‌ స్వయంగా వచ్చి చంద్రబాబును కలిశారని కూడా ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేశారు శైలజానాథ్‌. అసలు ఇప్పటివరకూ చేసుకున్న ఎంవోయూలకు సంబంధించి ఎ‍న్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు.  ఈరోజు( బుధవారం, జనవరి 21వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. ఎంవోయూల కోసం వచ్చేదంతా టీడీపీ ఏర్పాటు చేసిన మనుషులేనని స్పష్టం చేశారు. 

‘ వాళ్ళ కోటు రంగులు మారతాయే కానీ కంపెనీలు మాత్రం రావు. చెప్పిన అబద్ధాలే పదే పదే చెప్తున్నారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 18.87 లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి. ఏమైనా అడిగితే పెట్టుబడుల కోసం కాదు.. బ్రాండ్ వాల్యూ పెంచటం కోసం వెళ్తున్నామని లోకేష్ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.  ఆర్ఎంజెడ్ సంస్థతో లక్ష ఒప్పందం కుదుర్చుకున్నామని.. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అసలు లక్ష ఉద్యోగాలు ఎలా ఇస్తుంది?, లక్ష ఉద్యోగాలు ఆ సంస్థ ఇవ్వకుంటే ఏం చేయాలి?, అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ ఏర్పాటు చేస్తాం అన్నారు. 

దొనకొండలో డ్రోన్స్ యూనిట్ అన్నారు. వారు చెప్పిన ఏ ఒక్క కంపెనీ కనిపించటం లేదు. వీటి ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వచ్చి ఉండదు. చంద్రబాబు, వారి మంత్రులు తిరిగే ప్రత్యేక హెలికాఫ్టర్ల ఖర్చుతో అనేక పరిశ్రమలు పెట్టవచ్చు. మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి.. దేనికి ఖర్చు పెట్టారో కూడా లెక్కలు లేవు. గత ప్రభుత్వ హయాంలో మేం చేసుకున్న ఒప్పందాల్లో 90 శాతం గ్రౌండ్ అయ్యాయి. జగన్ ప్రభుత్వ హయాంలో దక్షిణ భారత దేశంలో సేవారంగంలో మొదటి స్థానం, ఉత్పత్తి రంగంలో 5వ స్థానం సాధించాం. చంద్రబాబు పరిశ్రమల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములు మొత్తం ప్రజలవే. దావోస్ వెళ్ళినా కూడా జగన్ నామస్మరణ చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని ధ్వజమెత్తారు.

బాబు, లోకేష్ దావోస్ టూర్‌పై శైలజానాథ్ అదిరిపోయే సెటైర్లు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)