Breaking News

‘ఈ ఎన్నిక పులివెందుల, చంద్రబాబు నీచత్వానికి మధ్య పోటీ’

Published on Mon, 08/04/2025 - 12:58

సా క్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివపప్రసాద్‌ రెడ్డి. 1978లో దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఇక్కడ రాజకీయాలు ప్రారంభించారని, అప్పటి నుంచీ ఏ ఎన్నికలో కూడా వారి కుటుంబం ఓడిపోలేదని తెలిపారు. పులివెందుల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గాన్ని వాళ్ళు సొంత ఇల్లులా చూసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఏ నియోజవర్గంలో జరగని అభివృద్ధి ఇక్కడ జరిగిందని తెలిపారు.

ఇప్పుడు జరిగేది 12 నెలల పదవి కలిగిన ఒక చిన్న మండల జడ్పీటీసీ ఉప ఎన్నిక అని శివప్రసాద్‌ రెడ్డి ్కొన్నారు. గత జడ్పీటీసీ మహేశ్వర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఈ ఉప ఎన్నిక జరుగుతోందని అన్నారు. సాధారణంగా పదవిలో మరణిస్తే మళ్ళీ సానుభూతితో వాళ్ళకే వదిలేసే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ చిన్న ఎన్నిక కోసం టిడీపీ పోటీకి దిగిందన్నారు.  ప్రజాస్వామ్య బద్దంగా టీడీపీ పోటీ చేయాలి కానీ  పోలీసులను నమ్ముకుని వారు పోటీలో దిగుతున్నారని మండిపడ్డారు.

ఆయన ఇంకా  మాట్లాడుతూ...‘ ఇక్కడ మీ బలం నామమాత్రమే అని మీకూ తెలుసు. ఈ మండలంలో 10,600 ఓట్లు ఉంటే గత 2024లో 3400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అయినా మీరు దంబికాలు పోతున్నారంటే మీరు ప్రజల్ని నమ్మి పోటీకి దిగలేదు. మేము ప్రజల్ని నమ్మి పోటీకి దిగాం. పులివెందుల ప్రజలు విశ్వాసానికి మారు పేరు. ప్రతిసారి వారు వైఎస్ కుటుంబ గౌరవాన్ని పెంచుతున్నారు. కానీ టీడీపీ డబ్బు, పోలీస్‌ను  నమ్మి ఎన్నికల్లో  దిగుతున్నారు.

ఇప్పుడు పులివెందులలో నాయకులను కొనడానికి వ్యాపారం చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టీ నాయకులను కొనేందుకు లావాదేవీలు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడే కొద్దీ అక్రమ కేసులు, బైండోవర్‌ల  పేరుతో పోలీస్‌లను వినియోగిస్తారు. స్పష్టంగా ఫ్రీ పోలింగ్ జరిగితే 4 వేలకు పైగా వైఎస్సార్‌సీపీకి మెజారిటీ వస్తుంది. వైఎస్‌ జగన్‌ను ఓడించాం అని జబ్బలు చరుచికోవడానికి తాపత్రయం పడుతున్నారుకానీ అది మీ వల్ల కాదు...ఈ  పులివెందుల ప్రజలు చాలా తెలివైన వారు. ఈ ఎన్నిక పులివెందులకు, చంద్రబాబు నీచత్వానికి మధ్య పోటీ.

Rachamallu Siva: గత సాంప్రదాయాలను టీడీపీ తుంగలో తొక్కింది

ఏదో విధంగా జగన్‌కు అవమానం చేయాలని చంద్రబాబు ఆడుతున్న నీచ క్రీడ ఇది. అయినా పులివెందులే గెలుస్తుంది. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. అప్పుడే రేషన్ డీలర్లపై వేదింపులు ప్రారంభం అయ్యాయి. కాంట్రాక్టర్లకు బిల్లుల ఏర చూపుతున్నారు. నిజంగా మీది మంచి పాలన అయితే ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి.  మీరు చేసింది శూన్యం కాబట్టి ధనం, పోలీసులను నమ్ముకుని పోటీకి దిగారు. మీరెన్ని చేసినా మేము శ్వాస వదిలే వరకు వైఎస్సార్‌సీపీ జెండా వీడేది లేదు’ అని  పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)