Breaking News

‘ఈ అరాచకాలకు చంద్రబాబే రాజగురువు’

Published on Fri, 08/22/2025 - 16:55

తాడేపల్లి :  టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు చేస్తున్న గలీజు పనులకు చంద్రబాబు నాయుడే రాజగురువు అని వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేష్‌ ధ్వజమెత్తారు. టీడీపీ అనేది డర్టీ పార్టీ అని, ఆ పార్టీ నేతలు చేసేవన్నీ డర్టీ పనులేనని మండిపడ్డారు. 

ఈ రోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన మహేష్‌.. ‘జనానికి టీడీపీ అనే డర్టీ పార్టీ మీద చిరాకు వేసింది. పబ్లిక్‌గా బూతు పనులు చేస్తున్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు వత్తాసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలకు చంద్రబాబు రాజగురువు. 

ఈ 15 నెలల్లో అరాచకాలు చేసిన ఏ ఎమ్మెల్యేపైనైనా చర్యలు తీసుకున్నారా? ఏమైనా అరెస్టులు చేశారా? బోను ఎక్కించారా? చట్ట ప్రకారం ఎవరి మీదైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. గత వారం రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అరాచకాలపై పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. 

అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా మీద ఏం చర్యలు తీసుకున్నారు?, డీలర్లతో కమీషన్ల వ్యవహారం బయటపడితే అచ్చెనాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, కనీసం విచారణకు కూడా ఎందుకు ఆదేశించలేదు?, రౌడీషీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వాలని సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఒక్కరి మీదనైనా చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదు. 

ఎమ్మెల్యే నసీర్ వేధింపులతో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తే చర్యలు తీసుకోలేదు ఎందుకు?, మహిళా ప్రొఫెసర్ మీద వేధింపులకు దిగిన కూన రవికుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు?, ఎమ్మెల్యేల మీద చంద్రబాబు సీరియస్ అని ఎల్లోమీడియాలో స్క్రోలింగ్ వేయించుకుని చేతులు దులుపుకున్నారు. జూ.ఎన్టీఆర్‌ని బూతులు తిట్టిన ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకున్నారు?, బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్తే తిరిగి వారిమీదే కేసులు పెట్టే సంస్కృతి ఇప్పుడే చూస్తున్నాం. 

ఒక్క టీడీపీ నేతపైనైనా చంద్రబాబు చర్యలు తీసుకున్నారా?

అటవీశాఖ అధికారుల మీద దాడి చేస్తే పవన్ కళ్యాణ్ మౌనం వహించారు. పవన్‌ని నమ్ముకుంటే ఎవరైనా నట్టేట మునుగుతారు. సుగాలి ప్రీతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారాల్లో ఏం చేశారు?, చంద్రబాబు ప్రయోజనాలే తప్ప పవన్‌కు ప్రజలతో పనిలేదు. చంద్రబాబు పాలన రాక్షస పాలనఈ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పే టైం దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)