Breaking News

‘ప్రజల ఓట్లతో గెలిచారా?.. లేక ఈవీఎంలతో గెలిచారా?’

Published on Tue, 02/03/2026 - 13:04

ఎర్రాతివారిపల్లి(అన్నమయ్య జిల్లా):  ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  కూటమి నేతల అదికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఈ ప్రభుత్వం.. ప్రజల ఓట్లతో గెలిచిందా.. లేక  ఈవీఎంల ద్వారా మీరే గెలిపించుకున్నారా? అని నిలదీశారు. 

ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 3వ తేదీ) అన్నమయ్య జిల్లాలోని సదుం మండలం ఎర్రాతివారిపల్లిలో పుంగనూరు నియోజకవర్గం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,  పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి,  తిరుపతి,చిత్తూరు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి , మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు హాజరయ్యారు. 

దీనిలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ‘ రాష్ట్రంలోమూడు రోజులుగా  జరుగుతున్న పరిమాణాలు మీరందరు చూస్తున్నారు. ఈ ప్రభుత్వంను ప్రజలు ఓట్లతో గెలిపించారా....? ఈవీఎంలు ద్వారా గెలిపించుకున్నారా.. ?,  కూటమి నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌ పాలనలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు.  దీన్ని ప్రజలు గమనించాలి’ అని సూచించారు.

Peddireddy: లడ్డు డైవర్షన్ కోసమే.. YSRCP నేతలపై దాడులు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)