Breaking News

‘కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉంది’

Published on Tue, 03/10/2026 - 12:48

రాజమహేంద్రవరం : కల్తీ పాల ఘటన బాధితుల గురించి కూటమి నేతలు పట్టించుకునే స్థితిలో లేరని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ విమర్శించారు. కూటమి నేతలకు నాటకాలు వేయడానికి టైం ఉంది.. కానీ కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే టైం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు(మంగళవాం, మార్చి 10వ తేదీ) రాజమహేంద్రవరం  ఆసుపత్రిలో కల్తీ పాల బాధితులను పరామర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్‌.

రాజమండ్రిలో కూటమి నేతల  తీరు ఆకతాయితనంగా ఉంది. నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ... చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి సత్య కుమార్‌లకు కల్తీ పాల బాధితుల గురించి  పట్టించుకునే పరిస్థితి లేదా?, దీన్నో యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల శాంపిళ్ళు నేషనల్ ఫోరెన్సిక్ లేబరేటరీకి ఎందుకు పంపలేదు. ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి. అప్పుడే నిజానిజాలు వెల్లడవుతాయి. పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలి. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి. 

పాలలో యూరియా కలిసిందా... ఫార్మాలిన్  కలిసిందా... గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా... అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదు. బాధితు కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్ మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. 

చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. మీ కుటుంబంలోనే ఇటువంటి ఘటనలు జరిగితే ఇలాగే ప్రవర్తిస్తారా?, పురుగుల మందు తీసుకుని ఎలా తీవ్ర అనారోగ్యం ఎదుర్కొంటారో అటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతుంది.ప్రభుత్వం హైడ్రామా ఆడుతోంది.

కల్తీ పల కేసు CBIకి అప్పగించాలి

ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచింది. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కల్తీయే. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)