Breaking News

ఇండిగోతో రామ్మోహన్‌ కుమ్మక్కు

Published on Sun, 12/07/2025 - 07:45

సాక్షి, అమరావతి: దేశంలో ఇండిగో విమానాల సంక్షోభం, రద్దీ, టికెట్‌ ధరల పెరుగుదల, భద్రతా లోపా­లకు ప్రధాన కారకుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. కేంద్ర విమానయాన శాఖ ­­మంత్రిగా రామ్మోహన్‌నాయుడు విఫ­లమయ్యా­రని, తక్షణమే ఆయన తన పదవికి రాజీ­నామా చేయాలని డిమాండ్‌ చేశారు. జూపూడి ప్రభాకర్‌రావు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లా­డారు.

‘ఇండిగో విమాన సంస్థతో రామ్మోహన్‌నా­యుడు కుమ్మక్కయ్యారు. దాని ఫలితంగానే ఇప్పు­డు సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. డీజీసీఏ దిగి వచ్చేదాకా ఇండిగో మొండిగా వ్యవహరించిందంటే కారణం రామ్మోహన్‌తో కుమ్మక్కు కావడమే. ఇంత గందరగోళం నెల­కొంటే ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి రామ్మోహన్‌ నాయుడు రీల్స్‌ చేసు­కు­ంటూ గడుపుతున్నారు. 

ఆ­యన విమానయాన శాఖ మంత్రిగా కాకుండా రీల్స్‌ మంత్రిగా మారా­రు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్‌ చేసింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడా­లని ఆదేశాలిచ్చింది. కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో సంస్థ పాటించేలా రామ్మోహన్‌ చేయలేకపోయారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చింది.’ అని జూపూడి చెప్పారు.  

కేంద్ర విమానయాన శాఖను లోకేశ్‌ పర్యవేక్షిస్తాడా? 
‘ఇండిగో సంక్షోభంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ వార్‌ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారంటూ టీడీ­పీ నేతలు నేషనల్‌ మీడియాలో మాట్లాడి పరు­వు తీశారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ­ను కూడా లోకేశ్‌ పర్యవేక్షిస్తున్నాడంటూ టీడీపీ ప్రతి­నిది వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర మంత్రి పదవితో లోకేశ్‌కు ఏం సంబంధం? లోకేశ్, రామ్మోహన్‌లు ఏపీ పరువును తీశారు. ఇండిగో సంస్థ ఒత్తిళ్లకు కేంద్ర మంత్రి పూర్తి తలొగ్గారని దేశవ్యాప్తంగా రామ్మో­హన్‌ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానం ఎక్కడమంటే భయం, నరకం, అనే స్థాయి­కి రామ్మోహన్‌ తీసుకెళ్లాడు. ఇంతటి అసమ­ర్థ మంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)