Breaking News

ఏపీలో శాడిస్టు పాలన: వైఎస్సార్‌సీపీ నేత శ్రీకాంత్‌రెడ్డి

Published on Wed, 08/21/2024 - 16:38

సాక్షి,తాడేపల్లి: ఏపీలో శాడిస్టు ప్రభుత్వం నడుస్తోందని, చంద్రబాబు తన మీడియాతో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని వై‌ఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత,మాజీ ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం(ఆగస్టు21) శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘వై‌ఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు మేలు చేశాం. కరోనా సమయంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగులకు అన్నీ చేశాం. చంద్రబాబు ఉద్యోగులతో ఎప్పుడూ ఫ్రెండ్లీగా లేరు.  బాబు హయాంలో ఉద్యోగులకు ఎప్పుడూ మంచి జరగలేదు

ఇష్టంలేని వారిని వేధిస్తూ  నవ్వుకునే తీరులో చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోంది. నెల్లూరులో ఐఅండ్‌పీఆర్‌ అధికారిని చంద్రబాబు దారుణంగా దూషించారు. చంద్రబాబు ఉద్యోగవర్గాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగులను తిడుతూ బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. వైఎస్‌జగన్ హయాంలో ఉద్యోగులకు చేయగలిగినంత చేశాం. కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో మేళ్లు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారు

ఉద్యోగు, అధికారులు అందరినీ వేధిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. ప్రద్యుమ్న, సాయిప్రసాద్, ఠాగూర్ లాంటి వారంతా చంద్రబాబుకు అనుకూలమైనప్పటికీ  వైఎస్‌జగన్ వారికి కీలకమైన పోస్టులు ఇచ్చారు. మరి ఇప్పుడు చంద్రబాబు కొందరు అధికారులపై ఎందుకు కక్షసాధింపులకు దిగుతున్నారు?

డీఎస్పీ పోస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇసుకరెడ్డి, మైనింగ్ ‌రెడ్డి అంటూ మాట్లాడటం కరెక్టేనా? ఎక్కడ ఏ కాగితం తగులపడినా ఉద్యోగులను టార్గెట్ చేసి సస్పెండ్ చేయడం సబబు కాదు. చంద్రబాబు తప్పులు బయట పడతాయని టీడీపీ వారే తగులపెడుతున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులను వేధించటం, వారిని కించపరిచటం మానుకోవాలి. ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన రెడ్డి కడప జిల్లా వ్యక్తి కావటమే ఆయన చేసిన తప్పా? ఆయనపై కూడా ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారు?

అభివృద్ధి, సంక్షేమం అనేది చంద్రబాబు హయాంలో ఎప్పుడూ ఉండదు. వైఎస్ఆర్ హయాంలో అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో ముందుకు తీసుకెళ్లారు. శ్రీ సిటీని వైఎస్‌ఆర్‌ తెచ్చినా, తానే తెచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ హయాంలో ప్రారంభించిన  పరిశ్రమలను కూడా తానే తెచ్చినట్టు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు’ అని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. 

ఇంద్రుడు, చంద్రుడు అంటూ కట్టుకథలు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)