Breaking News

‘సంపద సృష్టి ఏమైపోయింది.. ఇప్పుడు టీచర్లపై పడ్డారా?’

Published on Mon, 07/28/2025 - 15:36

తాడేపల్లి :  కూటమి ప్రభుత్వం  పీ-4 పరుతో టీచర్లను వేధించడం సరికాదని  వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారని, మరొకవైపు టీచర్లు కూడా పీ-4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారని మండిపడ్డారు. 

ఈరోజు(సోమవారం, జూలై 28) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన చంద్రశేఖర్‌రెడ్డి.. ‘ ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా ఒకవైపు వేధిస్తున్నారు. మరోవైపు టీచర్లు కూడా p4 కింద పేదలను దత్తత తీసుకోవాలంటున్నారు. అసలు జీతాలే సరిగ్గా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?, ఎన్నికలలో గెలుపు కోసం సంపద సృష్టిస్తానంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోమనటం అన్యాయం. పారిశ్రామిక వేత్తలు, సంపన్నులతో దత్తత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. 

Chandra Sekhar: అసలు జీతాలే సరిగా ఇవ్వకుండా మళ్ళీ దత్తత తీసుకోవటం ఏంటి?

ఇప్పుడేమో టీచర్లనే తీసుకోమని కలెక్టర్లతో చెప్పిస్తున్నారు. బలవంతంగా దత్తత తీసుకోమని బెదిరించడం అన్యాయం. పరిపాలనా విధానాన్ని సర్వ నాశనం చేయటానికే ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తోంది. దేశంలో చాలామంది పన్నులు ఎగ్గొట్టినవారు ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి పన్నులు వసూలు చేస్తే లక్షలమంది పేదల జీవితాల్లో మార్పు తేవచ్చు. 

పాఠాలు చెప్పాల్సిన మమ్మల్ని  p-4 కోసం వాడుకోవటమేంటని టీచర్లు అడుగుతున్నారు. టీచర్లు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉద్యోగులతో రాజకీయ నాయకుల కాళ్లు పట్టించుకోవడం సిగ్గుచేటు. విరామం లేకుండా డ్యూటీ చేయించటం వలన రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఉద్యోగుల మీద ఒత్తిడి చేసి వారిని వేధించవద్దు’ అని ఆయన సూచించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)