Breaking News

‘రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు’

Published on Sun, 11/30/2025 - 13:58

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారాయన. పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల వలన రైతులు నష్టపోయారని, రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదన్నారు బొత్స.

 ‘రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు..గత ప్రభుత్వ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల సమస్యలు తీవ్రంగా ఉంటే కేంద్ర ప్రభుత్వంకు లేఖలు రాస్తారా.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదు. క్వింటా రేటు రూ. 2300 నుంచి రూ. 1500 లకు పడిపోయింది.ప్రభుత్వ దృష్టి విశాఖ భూముల మీద ఉంది.ఎవరికి 99 పైసలకే భూములు కట్టబెట్టాలని చూస్తుంది. 

రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇచ్చినప్పుడు ఎందుకు పారదర్శకత పాటించలేదు.కోట్లాది రూపాయల భూములను 99 పైసలకే ఎలా ఇస్తున్నారు.. విశాఖలో భూములను వేలం పెట్టి ఇవ్వాలి. భూములు పేరు చెప్పి దోపిడి చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ జగన్ పథకాలకు ప్రభుత్వ పెద్దలు పేర్లు మార్చి పబ్బం. గడుపుకుంటున్నారు. 

గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ దోపిడీకి విశాఖ అడ్డాగా మారింది.గతంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు తీరకుండానే అమరావతికి భూసేకరణ అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు భూసేకరణ చేయలేకపోయారు. కేజీహెచ్ పై ప్రభుత్వానికి పర్యవేక్షణ లేదు. లులు ఒక పనికిమాలిన సంస్థ.అటువంటి సంస్థకు భూములు ఇచ్చారు.ఇనార్బిట్ మాల్ కు, లులు సంస్థకు పోలికలే లేదు’ అని మండిపడ్డారు.

.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)