Breaking News

డొక్కా.. నోరు అదుపులో పెట్టుకో

Published on Mon, 02/10/2025 - 03:45

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రాపకం కోసమే డొక్కా మాణిక్య వరప్రసాద్‌(Dokka Manikya Vara Prasad) వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్(YS Jaganmohan Reddy),  పార్టీ నేతల గురించి నోటికొ­చ్చి­నట్టు మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొమ్మూరి కనకా­రావు(Kommuri Kanakarao) చెప్పారు. డొక్కా నోరు అదుపులో పెట్టుకోక­పోతే గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఆయన ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారే అలవాటున్న డొక్కా, వెన్నుపోట్లు గురించి.. అది కూడా వెన్ను­పోటుకి బ్రాండ్‌ అంబాసి­­డర్‌ అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ­­లో ఉండి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డొక్కాను రాజకీయ వ్యభిచారి అని అనా­లని ఉన్నా ఆయన వయసును చూసి గౌరవం ఇస్తున్నామని చెప్పారు. చంద్రబాబు మెప్పుకోసం డొక్కా చేస్తున్న ఆరోపణ­లు చూస్తుంటే మంత్రిగా పనిచేసింది ఈ వ్యక్తేనా అని సందేహం కలుగుతోందన్నారు. చంద్రబాబుకి కూడా డొక్కా వ్యవహారం తెలుసు కాబట్టే ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని చెప్పారు.

జగన్‌ అన్నం పెట్టడంలేదని విజయమ్మ ఏమైనా డొక్కాకు ఫోన్‌ చేసి చెప్పారా అని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌­పై అవాకులు చవాకులు పేలితే ఊరుకోబో­మని హెచ్చ­రించారు. దళిత కార్డును అడ్డం పెట్టు­కుని ఏది మాట్లాడినా చెల్లుతుందనుకుంటే పొరపా­టే­నని చెప్పారు. ఈ రాష్ట్రంలో దళితులకు న్యాయం జరి­గింది కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయా­ంలోనే అని తెలిపారు. వైఎస్‌ జగన్‌ 5 మంది దళి­తు­లకు మంత్రి పదవులు ఇచ్చారని, 15 మంది ఎస్సీ­ల­ను కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమించారని తెలి­పా­రు. డొక్కాకు చేతనైతే సూపర్‌ సిక్స్‌ హామీలు అమ­లు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడి­చి­న చంద్రబాబును ప్రశ్నించాలని కనకారావు చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)