Breaking News

అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం: బొత్స

Published on Sat, 08/24/2024 - 15:39

సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్‌ బాధితులకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.

ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్‌ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.

‘‘ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్‌కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)