Breaking News

ఫిబ్రవరి 5న వైస్సార్‌సీపీ ఫీజుపోరు.. పోస్టర్‌ విడుదల

Published on Thu, 01/30/2025 - 16:15

సాక్షి, తాడేపల్లి: ఫిబ్రవరి 5న వైఎస్సార్‌సీపీ చేపట్టే 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు.

2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైఎస్‌ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫీజుపోరు పోస్టర్ రిలీజ్

చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు: జోగి రమేష్
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నారు. వైఎస్‌ జగన్ విద్యార్థులకు అండగా నిలిచారు. కానీ చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. బాధిత విద్యార్థుల తరపున పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. కలెక్టరేట్ల ఎదుట ఫిబ్రవరి 5న పోరాటం చేస్తాం. చంద్రబాబు విద్యార్థులను మోసం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే రిలీజ్ చేయాలి

విద్యా వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్‌
వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారు. కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు కూడా ఇవ్వడం లేదు. జగన్ అభివృద్ధి చేసిన స్కూళ్లను చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారు. ప్రైవేట్‌ స్కూల్‌కు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు.

ఇదీ చదవండి: CBN.. చెబితే నలుగురు నమ్మేలా ఉండాలి!

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)