Breaking News

బాబు ష్యూరిటీ-గ్యారంటీ ఏమైంది.. సంపద సృష్టి ఎక్కడ?: బుగ్గన

Published on Thu, 04/24/2025 - 11:49

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా? అంటూ కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్‌ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు.

మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘మా పరిపానలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం. సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసాకు నిధులేవి?. సున్నా వడ్డీ రుణాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, మత్సకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు?. విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం లేదు. ఏపీఎండీసీకి రూ.9 వేల కోట్లు ఎందుకు కేటాయించారు?

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాకుండా నీతులు చెబుతున్నారా?. ఇప్పుడు సంపద సృష్టి ఏమైంది? అప్పు పరిస్థితి ఏంటి?. వైఎస్సార్‌సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువగా అప్పు చేసింది. ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించకపోవడంతో ప్రజా ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. బాబు ష్యూరిటీ-బాబు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు ఏమైంది?’ అని ప్రశ్నించారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)