రాక్షస పాలనపై ప్రజా పోరాటం చేద్దాం: వైఎస్‌ జగన్‌

Published on Fri, 07/19/2024 - 04:41

సాక్షి, అమరావతి: ఏపీలో సాగుతోన్న రాక్షస పాల నపై ప్రజాపోరాటం చేద్దామని వైఎస్సార్‌సీపీ అధ్య క్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపుని­చ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ నడిరోడ్డుపై పాశ వికంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘట న గురించి తెలియ­గానే బెంగళూరులో ఉన్న వైఎస్‌ జగన్‌ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. రషీద్‌ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.

గురు వారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివా సానికి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలిగానీ.. వైఎస్సార్‌సీపీని అణగ­దొక్కాలనే కోణంలో దారు ణాలకు పాల్పడటం హేయమన్నారు.

కొత్తగా కొలు వుదీరిన ప్రభు­త్వా­నికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ అధికారంలోకి వచ్చిన నెల న్నరలోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్‌ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ట అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజ లందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురు ద్దేశాలతో వెనకుండి ప్రోత్సహిస్తుండటం వల్లే ఇ లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని.. అంద రికీ అండగా నిలుస్తామని జగన్‌ భరోసా ఇచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)