Breaking News

అందరివాడు జగన్‌ను ఆశీర్వదించండి

Published on Tue, 05/07/2024 - 04:56

చక్రాయపేట: ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించిన మీ అందరివాడు సీఎం వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి భారతమ్మ ప్రజలను కోరారు. ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ సతీష్ రెడ్డి, మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డితో కలసి సురభి గ్రామం బీటీపల్లెలో ఇంటింటి ప్రచారం, రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా  భారతమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎలాంటి బేధాలు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టనన్ని పథకాలను అమలు చేసి.. అందరినీ ఆ  రి్థకంగా బలోపేతం చేసిన ఘనత వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్లు, ఆసరా, సున్నా వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా దేశంలో ఎక్కడా లేని పథకాలను మన రాష్ట్రంలో అందించి ఆదర్శంగా నిలిచారు.

పేదల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇంతటి గొప్ప పాలన మళ్లీ కావాలన్నా.. సంక్షేమాభివృద్ధి కొనసాగాలన్నా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వైఎస్‌ జగన్‌ను, అవి నాష్ రెడ్డిని గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించండి’ అని ప్రజలకు భారతమ్మ విజ్ఞప్తి చేశారు. 

గడప గడపకూ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ.. 
ముఖ్యమంత్రి సతీమణి వైఎస్‌ భారతమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీటీపల్లెలో గడప గడపకూ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్‌ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ మళ్లీ ప్యాన్‌ గుర్తుకు ఓట్లేయాలని కోరారు. లక్షుమమ్మ అనే వృద్ధురాలు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో భారతమ్మ ధైర్యం చెప్పారు. పులివెందులలోని ఆస్పత్రిలో చూపించుకోవాలని సూచిస్తూ.. అక్కడి వైద్యుడికి లేఖ రాసి ఇచ్చారు.

అలాగే శారదమ్మ అనే మహిళ తన సమస్య చెప్పుకోగా.. న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రీ, కొడుకులు ఓబుళశెట్టి శ్రీరాములు, అయ్యప్ప ప్రసాద్‌ను  భారతమ్మ ఆప్యాయంగా పలకరించారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. చెన్నకేశవులు అనే వృద్ధుడిని ‘ఆరోగ్యంగా ఉన్నావా తాతా’ అంటూ పలకరించారు. మందులు సకాలంలో వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.

అలాగే చిన్నారులను, విద్యార్థులను పలకరించిన భారతమ్మ.. బాగా చదువుకోవాలని చెప్పారు. మీ కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలను సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని వివరించారు. కాగా,  భారతమ్మతో సెల్ఫీలు దిగేందుకు యువతీయువకులు పోటీ పడగా.. మహిళలు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో చక్రాయపేట, తొండూరు మండల ఇన్‌చార్జ్‌లు వైఎస్‌ కొండారెడ్డి, వైఎస్‌ మధురెడ్డిల సతీమణులు ధనలక్ష్మి, మాధవీలత, కొండారెడ్డి, సతీ‹Ùరెడ్డిల తనయులు రాహుల్‌రెడ్డి, రోహన్‌ నాగిరెడ్డి, ఎంపీపీ మాధవీ బాలకృష్ణ, జెడ్పీటీసీ శివప్రసాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామాంజనేయరెడ్డి, ప్రసాదరావు, సభాపతి నాయుడు, వెంకట సుబ్బయ్య, వేదమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)