Breaking News

ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు

Published on Sat, 08/17/2024 - 17:53

తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ కార్యాలయం వద్ద ఫైల్స్‌ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్‌ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో  ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.

‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్‌ అండ్‌ ఆర్‌ స్పెషల్‌ కలెక్టర్‌ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్‌ కాదని ఆర్డీవో కేఎన్‌ జ్యోతి అంటున్నారు. 

‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్‌ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.

అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్‌ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్‌ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్‌ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్‌సీపీ హయాంలోని ఫైల్సే  తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ  స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. 

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)