Breaking News

త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళసై గెలిచేనా?

Published on Sat, 04/06/2024 - 21:26

చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్‌లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్‌ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విజయం సాధిస్తారా?

తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్‌ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్‌ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్‌ తలపడనున్నారు.  

 గవర్నర్‌ పదవినే వదులుకున్నా
ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్‌ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్‌ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు.

నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి 
తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్‌ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు.  

వారిదే కీలకం 
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో  సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌