Breaking News

‘మహా’రాజకీయాల్లో కీలక పరిణామం.. షిండే ఏమన్నారంటే?

Published on Sun, 12/01/2024 - 18:18

ముంబై : మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహరాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండేని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టాలనే యోచనలో మహాయుతి కూటమి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా  చర్చలు జరుపుతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే, ఆ చర్చల్లో నిజమెంత? అనే దానిపై స్పష్టత రావాలంటే వేచి చూడాల్సి ఉంది.  

మరోవైపు, శ్రీకాంత్‌ షిండేకు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న వార్తపై ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. ‘ఇలాంటి చర్చలన్నీ మీడియా వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. మహాయుతి కూటమిలో పదవులపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.  

ఎన్నికల ఫలితాల అనంతరం, రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికే కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాత్‌తో నేను (ఏక్‌నాథ్‌షిండే), అజిత్‌ పవార్‌, దేవేంద్ర ఫడ్నవీస్‌ భేటీ అయ్యాం. ముంబైలో మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ సమావేశంలో అన్నీ విషయాలపై కులంకషంగా చర్చిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన ప్రజలకు మేం జవాబుదారీగా ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. 

మరోవైపు, మహాయుతి పెద్దలు తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏక్‌నాథ్‌ షిండే ఖండించారు. తీవ్ర జ్వరంతో సతారా జిల్లాలోని తన స్వగ్రామంలో ఉన్న షిండే మీడియాతో మాట్లాడుతూ.. నిర్విరామంగా ఎన్నికల ప్రచారం కారణంగా అనారోగ్యానికి గురయ్యా. అందుకే మా స్వగ్రామం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నా. నా ఆరోగ్యం బాగుంది. ఇక మహరాష్ట్ర సీఎం ఎవరు? అని అంటారా.  సోమవారం మహాయుతి పెద్దలే స్పష్టత ఇస్తారు’ అని స్పష్టం చేశారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)