Breaking News

సీటు దక్కని సుమలత.. ఏం చేయబోతున్నారు?

Published on Sat, 03/30/2024 - 14:23

బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు ఇచ్చింది. 

ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. 

“రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్‌ విజయేంద్ర తెలిపారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)