Breaking News

స‌యోనీ సూప‌ర్ ట్విస్ట్‌.. అస్స‌లు ఊహించ‌లేదు!

Published on Mon, 06/15/2026 - 18:24

కోల్‌క‌తా: పార్టీ కోసం అంకిత‌భావంతో ప‌నిచేసే నేత‌ల‌ను కాద‌ని సినిమా తార‌ల‌ను అందం ఎక్కించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి త‌గిన శాస్తి జ‌రిగింద‌ని ఆ పార్టీకి చెందిన నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాల‌ని, పార్టీ కోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే వారిని గుర్తించాల‌ని కోరుతున్నారు. 20 మంది టీఎంసీ ఎంపీలు మ‌మ‌తా బెన‌ర్జీపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసి ఎన్డీఏ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అధినేత్రి తీరుపై పార్టీలో గుస‌గుస‌లు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా స‌యోనీ ఘోష్ (Saayoni Ghosh).. రెబల్ ఎంపీల వర్గంలో చేరడం టీఎంసీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

గుణ‌పాఠం నేర్పారు
మ‌మ‌తా బెన‌ర్జీకి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెన‌ర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న స‌యోనీ ఘోష్.. టీఎంసీని వీడ‌తార‌ని ఊహించ‌లేద‌ని ఆ పార్టీ నేత‌లు పేర్కొంటున్నారు. స్థాయికి మించి అవ‌కాశాలు క‌ల్పించినా ఆమె పార్టీని వీడ‌డం జీర్ణించుకోలేపోతున్నామ‌ని చెబుతున్నారు. “స‌యోనీ ఘోష్‌ రెబల్ వర్గంలో చేరుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఆమెను అభిషేక్ బెనర్జీ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. మమతా బెనర్జీ కూడా ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి నాయకురాలిగా ఎదిగే అవకాశం కల్పించారు. ఇది మమతా, అభిషేక్‌లకు కూడా ఒక పాఠం. పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతల కంటే సినీ రంగం నుంచి వచ్చిన వారిపైనే ఎక్కువగా నమ్మకం ఉంచారు” అని టీఎంసీ సీనియ‌ర్ నాయ‌కుడొక‌రు వ్యాఖ్యానించారు.

మ‌హువా మెయిత్రా భావోద్వేగం
పార్టీని వీడి, రెబ‌ల్ గ్రూపు ఎంపీల‌తో స‌యోనీ ఘోష్ చేతులు క‌ల‌ప‌డం త‌న‌ను బాధించింద‌ని టీఎంసీ ఎంపీ మ‌హువా మెయిత్రా వ్యాఖ్యానించారు. “స‌యోనీ నాకు చెల్లెలిలాంటిది, కూతురితో స‌మానం. ఆమె పార్టీని విడిచిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆమె ఎంతో కష్టపడి ఎదిగింది. డబ్బు కోసం లేదా వ్యక్తిగత లాభం కోసం పనిచేసే వ్యక్తి కాదు. గత ఐదేళ్లలో పార్టీ ఆమెకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి వ్యక్తి పార్టీని వీడాలని ఆలోచించడం చాలా బాధాకరం. భయాన్ని జయించి ముందుకు సాగాలని నేను ఆమెకు చెప్పాలనుకుంటున్నాను” అని మహువా మొయిత్రా పేర్కొన్నారు.

స‌యోనీ స్థానంలో అర్నాబ్
టీఎంసీలో సంక్షోభం నేప‌థ్యంలో రెబ‌ల్ ఎంపీల వ‌ర్గంలో స‌యోనీ ఘోష్ చేరిన‌ట్టు గత వారం వార్త‌లు వ‌చ్చాయి. ఎన్డీఏకు మ‌ద్ద‌తుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు రెబ‌ల్ ఎంపీలు స‌మ‌ర్పించిన లేఖ‌లో ఆమె కూడా సంత‌కం చేసిన‌ట్టు తెలియ‌డంతో క‌ల‌క‌లం రేగింది. దీనిపై గత వారాంతంలో ఢిల్లీలో ఆమె స్పందిస్తూ..  “సమయం వచ్చినప్పుడు మాట్లాడుతాను” అని పేర్కొన్నారు. తాజాగా ఆమెతో పాటు పలువురు రెబల్ ఎంపీలతో పాటు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను కలిసి.. నేష‌న‌లిస్ట్ సిటిజ‌న్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో తామంతా విలీనమైనట్లు ప్రకటిస్తూ పార్లమెంట్‌లో ప్రత్యేక గ్రూప్‌గా గుర్తింపు ఇవ్వాలని కోరారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి స‌యోనీ ఘోష్‌ను తొల‌గించి, ఆమె స్థానంలో అర్నాబ్ బెన‌ర్జీ (Arnab Banerjee)ని మ‌మ‌త నియ‌మించారు.

చ‌దవండి: తాను రాఘ‌వ్ చ‌ద్దాను కాదంటూనే.. ఝ‌ల‌క్‌!

స‌యోనీ రాజకీయ ప్రస్థానం
2021 అసెంబ్లీ ఎన్నికల ముందు సయోనీ ఘోష్ అధికారికంగా టీఎంసీలో చేరారు. అంతకుముందు ఆమె బీజేపీపై విమర్శలు చేస్తూ వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. అదే ఏడాది ఆసన్సోల్ సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్‌పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆమె ఎన్నికల ప్రచారంలో చూపిన చురుకుదనం టీఎంసీ అధిష్ఠానాన్ని ఆకట్టుకుంది. ఎన్నికల అనంతరం అభిషేక్ బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు. సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగిస్తూ జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ యువ నాయకురాలిగా స‌యోనీ వేగంగా ఎదిగారు. ప్ర‌స్తుతం జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజ‌వ‌ర్గానికి ప్రాతినిథ్య‌వం వ‌హిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)