Breaking News

హర్యానాలో ఆప్‌ ఓటమికి 10 కారణాలు

Published on Tue, 10/08/2024 - 14:01

న్యూఢిల్లీ:  హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు  ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. హర్యానాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు నిరాశే ఎదురయ్యేలా ఉంది. హర్యానాలో  ఆప్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆశలు అడియాలసలయ్యాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో ఆప్‌ అభ్యర్థులు ఒక్క సీటులో కూడా ముందంజలో లేరు. హర్యానాలో ఆప్ ఓటమికి 10 ప్రధాన కారణాలివే..

కాంగ్రెస్‌తో పొత్తు లేదు 
సీట్ల పంపకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరలేదు. దీంతో బీజేపీ లబ్ధి పొందింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి.

ఐదు సీట్లకు పరిమితమై.. 
ఆప్ మొదట 10 సీట్లు అడిగింది. కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేకపోవడంతో ఆప్‌ తన డిమాండ్‌ను ఐదుకి తగ్గించింది. అయితే కాంగ్రెస్ మూడు సీట్లు ఇచ్చింది. ఆప్‌ అందుకు అంగీకరించలేదు.

ఆప్‌-  కాంగ్రెస్ మధ్య పోరు 
హర్యానా కాంగ్రెస్ నేతలలో ముఖ్యంగా భూపేంద్ర సింగ్ హుడా ఆప్‌ సహకారాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆప్‌ సాయముంటే కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పేలవమైన పార్టీ పనితీరు 
హర్యానాలో ఆప్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహాన్ని చూపలేదు. గత ఎన్నికల్లోనూ ఆప్‌కు విజయం దక్కలేదు. ఓట్ల శాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది.

బీజేపీకి అనుకూల గాలి 
హర్యానాలో  బీజేపీకి అనుకూలమైన గాలి వీచింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న సీట్లు కాంగ్రెస్‌కు ఆప్‌కు ఆఫర్ చేసింది. ఇక్కడ పోటీని ఎదుర్కోవడం ఆప్‌కు కష్టమయ్యింది.

అట్టడుగు నుంచి మద్దతు శూన్యం
హర్యానాలో ఆప్‌కు అట్టడుగు స్థాయి నుంచి మద్దతు దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే అంత బలపడని కారణంగా విజయం సాధించలేకపోయింది. స్థానిక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది.

చీలిన బీజేపీ వ్యతిరేక ఓట్లు 
హర్యానాలో పలు పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజల ఓట్లు చీలిపోయి, ఆప్ విజయావకాశాలు మరింత తగ్గాయి.

ఆకట్టుకోవడంలో విఫలం 
ఆప్‌ నేతలకు సంబంధించిన వివాదాల కారణంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతింది. హర్యానా ప్రజల హృదయాలను ఆ పార్టీ గెలుచుకోలేకపోయింది.

వ్యూహాత్మక అంచనా లోపం 
హర్యానాలో ఆప్ తన బలాన్ని అంచనా వేయడంలో తప్పుగా లెక్కలు వేసుకుంది. ఇది వైఫల్యానికి  దారితీసింది.

సమయం కేటాయించని నేతలు 
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ నేతలు తమ పూర్తి సమయం కేటాయించలేదు. చివరి క్షణం వరకూ ఆప్‌కు కాంగ్రెస్‌తో పొత్తు కుదరలేదు. దీంతో అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం, వ్యూహాలు రచించడం ఆప్‌కి భారంగా మారింది.
 

ఇది కూడా చదవండి: కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)