Breaking News

ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్‌ చరణ్‌ మాఝీ?

Published on Tue, 06/11/2024 - 19:45

భువనేశ్వర్‌ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝీని ఎంపిక చేసింది.

ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్‌ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్‌ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్‌ చరణ్‌ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.

డిప్యూటీ సీఎంలుగా
కేవీ సింగ్ డియో బోలంగీర్‌ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.

తీవ్ర కసరత్తు
ఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లను పంపింది. భువనేశ్వర్‌లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)