Breaking News

అమిత్‌ షా ఎంట్రీ.. వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్‌

Published on Fri, 06/30/2023 - 18:14

చెన్నై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని క్యాబినెట్‌ నుంచి తప్పిస్తూ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని గంటల్లోనే ఆర్‌.ఎన్‌. రవి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సూచన మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ అమిత్ షా ఏం చెప్పారు? ఎందుకు సెంథిల్ బాలీజీ విషయంలో గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి వెనక్కి తగ్గారు?

క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌, మనీల్యాండరింగ్‌ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో క్యాబినెట్‌ నుంచి మంత్రి సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్‌ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర  ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు అర్ధరాత్రి సమయంలో అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి నిర్ణయం న్యాయ పరంగా చిక్కుల్ని తెచ్చి పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే అటార్ని జనరల్‌ సూచన తీసుకోమని అమిత్‌ షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్‌ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్‌ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్‌ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్‌ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్‌ కొనసాగుతుండడం గమనార్హం.

ఇదీ చదవండి: అర్ధరాత్రి తమిళనాట హైడ్రామా.. మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)