Breaking News

19 వరకూ బెంగాల్‌లో 400 కంపెనీల కేంద్ర బలగాలు

Published on Mon, 06/03/2024 - 08:39

2024 లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలను ఎన్నికల సంఘం జూన్ 4న వెల్లడించనుంది. మరోవైపు గత కొన్నేళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగించాలని నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన అనంతరం 400 కంపెనీల కేంద్ర బలగాల మోహరింపును జూన్ 19 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జూన్ 19 వరకు కేంద్ర బలగాల భద్రతా సిబ్బందిని మోహరించనున్నామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలకు ఓటింగ్ జరిగింది. నేడు (సోమవారం) కొన్ని బూత్‌లలో రీపోలింగ్ జరుగుతోంది. ఓట్ల లెక్కింపు ముగిసిన రెండు రోజుల వరకూ అంటే జూన్ 6 వరకు కేంద్ర బలగాలను  మోహరించాలని ఎన్నికల సంఘం గతంలో నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని ఈ నెల 19 వరకూ కొనసాగించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు.

బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇటీవల ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక పరిశీలకునితో సమావేశమయ్యారు. అలాగే కోడ్‌ ముగిసిన తర్వాత కూడా మూడు నెలల పాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచాలని గవర్నర్‌తో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు