Breaking News

గ్యారంటీ కార్డుతో ప్రజల్లోకి వెళతాం

Published on Tue, 08/29/2023 - 01:33

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక అంశాలతో గ్యారెంటీ కార్డును రూపొందిస్తామని.. ఆ గ్యారెంటీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయడం ద్వారా అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకుంటామనే భరోసాను ప్రజల్లో కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే చెప్పారు. సెప్టెంబర్‌ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలన్న ప్రతిపాదన ఉందని.. ఒకట్రెండు రోజులు అటూఇటూగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు.

సోమవారం గాం«దీభవన్‌లో రోహిత్‌చౌదరి, మహేశ్‌కుమార్‌గౌడ్, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఫహీంలతో కలసి ఠాక్రే మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీపరంగా అంతర్గతంగా సర్వేలు నిర్వహిస్తున్నామని, తాము అధికారంలోకి వస్తామని వాటిలో స్పష్టంగా వెల్లడవుతోందని చెప్పారు. రోజురోజుకూ బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఈ గ్రాఫ్‌ మరింత దిగజారుతుందని పేర్కొన్నారు.

‘‘తెలంగాణలో ఒక కారు తిరుగుతోంది. ఆ కారులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితలతోపాటు బీజేపీ కూడా కలసి ప్రయాణం చేస్తోంది..’’ అని ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. త్వరలోనే బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లను ప్రకటిస్తామన్నారు. 

‘లెఫ్ట్‌’కు తలుపులు మూయలేదు 
లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు అంశంపై ఠాక్రే మాట్లాడారు. ‘‘లెఫ్ట్‌ పార్టీలతో మేం మాట్లాడాం. వారు మాతో మాట్లాడారు. కానీ ఇదంతా అనధికారికమే. అధికారికంగా ఇంకా చర్చలు ప్రారంభం కాలేదు. లెఫ్ట్‌ పార్టీలకు మా తలుపులు మూసి ఉంచలేం. ఎందుకంటే వారు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కాదు. ఇండియా కూటమిలో భాగస్వాములు. అయినా వారితో చర్చలు జరపాల్సింది నేను కాదు.

పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత వారితో చర్చిస్తారు. అప్పుడే చర్చలు అధికారికంగా ప్రారంభమైనట్టు లెక్క. అప్పటివరకు వచ్చే వార్తలన్నీ ఊహాగానాలే..’’ అని పేర్కొన్నారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చే విషయం గురించి రాష్ట్రస్థాయిలోని తమకు అవగాహన లేదన్నారు. వీలైనంత త్వరగా పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌