Breaking News

అది ‘బీజేపీ గ్రామం’.. మరో పార్టీ ‍కన్నేయదట!

Published on Sat, 04/13/2024 - 07:15

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి నెలకొంది. అన్ని ప్రాంతాల్లోనూ వివిధ పార్టీలు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. ప్రతీ పార్టీ వీలైనన్ని ఓట్లు దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. అయితే దేశంలోని ఆ గ్రామంలో కొనసాగే రాజకీయాల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది? ప్రత్యేకత ఏమిటి?

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లాలోని ఒక గ్రామంలోని జనం దశాబ్ధాల తరబడి బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారు. ఈ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి కాంగ్రెస్‌ లేదా ఇతర ఏ పార్టీ కూడా ప్రచారానికి రాదు. గ్రామంలో కొన్ని దశాబ్ధాలుగా ఇదే జరుగుతోంది. గ్రామంలోనివారంతా బీజేపీకి ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నారు. 

చంద్రపూర్‌లోని బల్లార్‌పూర్‌ అసెంబ్లీ పరిధిలోకి వచ్చే ఉథల్‌పేత్‌ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఈ గ్రామంలో 653 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 96 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈ ఓట్లన్నీ బీజేపీకే దక్కడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ గ్రామంలోని ఓటర్లంతా బీజేపీకే తమ ఓటు వేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్‌ లీడ్‌లోకి రాగా, ఉథల్‌పేత్‌లోని ఓట్లన్నీ బీజేపీకే పడటం విశేషం. 

ఈ గ్రామం ఆదర్శగ్రామంగానూ పేరొందింది. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ తామంతా బీజేపీకే పట్టం కడతామని గ్రామస్తులు చెబుతున్నారు. బిల్లార్‌పూర్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత సుధీర్‌ మున్‌గాంటీవర్‌ తమ గ్రామాన్ని అభివృద్ధిపథాన నడిపించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని తెలిపారు. దీంతో గ్రామంలోని వారంతా స్వచ్ఛందంగా బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని పంచాయితీ కూడా బీజేపీ పాలకవర్గం చేతిలోనే ఉండటం విశేషం. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)