Breaking News

‘పులివెందులలో భారీ రిగ్గింగ్‌ జరిగింది’

Published on Tue, 08/12/2025 - 16:18

పులివెందుల: వైఎస్సార్‌ కడప జిల్లాలోని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా టీడీపీ నేతల దౌర్జన్య కాండపై వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందులలో భారీ రిర్గింగ్‌ జరిగిందని ఎంపీ అవినాష్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు, టీడీపీ గూండాలు కలిసి రిగ్గింగ్‌లకు పాల్పడ్డారన్నారు. తమ ఏజెంట్లను పోలింగ్‌ బూత్‌లో లేకుండా చేశారని, బయట నుంచి వేలాది మంది టీడీపీ గూండాలను తెచ్చారన్నారు. ఈ ఉప ఎన్నికలను బర్తర్‌ప్‌ చేయాలని అవినాష్‌ డిమాండ్‌ చేశారు. 

పులివెందులపై పోలీసులు పగబట్టారని మండిపడ్డారు.  కార్యకర్తలు సంయమనం పాటించాలని, పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారన్నారు. ఇంకా ఏం చేయాలనుకున్నా చేసుకోనివ్వండని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొందామని అవినాష్‌ పేర్కొన్నారు. టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై కుట్రలు చేశారని, ఇంత చెత్త, ఘోరమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. కేంద్ర బలగాలతో రీపొలింగ్‌ నిర్వహించాలన్నారు.

అవినాష్‌తో అచ్చివెల్లి గ్రామస్తులు
పులివెందుల ఉప ఎన్నికలో భాగంగా అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌రెడ్డిని కలిశారు. తమను ఓటువు వేయనీయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారని, ఏజెంట్లుగా కూర్చున్న మహిళలను బెదిరించారన్నారు.  కత్తులు, కర్రలతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారని, పోలింగ్‌ కేంద్రాల నుంచి మహిళా ఏజెంట్లు వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారన్నారు. వచ్చిన వారంతా ఇతర ప్రాంతాల నుంచి తమ గ్రామంలోకి వచ్చిన వారేని వారు ఎంపీ అవినాష్‌కు తెలిపారు. 

తమ గ్రామంలో 600 ఓట్లకు గాను 300 మంది గూండాలను మోహరించారన్నారు. తమ ఓటు హక్కును అడ్డుకునే అధికారం టీడీపీ నేతలకు ఎవరిచ్చారన్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి దౌర్జన్యాఉ జరగలేదని,  మహిళలను కూడా చూడకుండా తమను బూతులు తిట్టారని, చంపుతామని బెదిరించారరని అచ్చివెల్లి గ్రామస్తులు ఎంపీ అవినాష్‌కు స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)