‘నా గుండె పగిలింది’.. కరూర్‌ తొక్కిసలాటపై టీవీకే అధినేత విజయ్‌

Published on Tue, 09/30/2025 - 16:03

సాక్షి,చెన్నై: ‘నన్ను టార్గెట్‌ చేయండి.. ప్రజల్ని కాదు’ అంటూ కరూర్‌ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్‌ తొలిసారి స్పందించారు. ఈ మేరకు విజయ్‌ మంగళవారం (సెప్టెంబర్‌30న) ఓ వీడియోను విడుదల చేశారు. 

ఆ వీడియోలో ‘ఈ ఘటన నన్ను కలచివేసింది. నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైంది. మాటలు రావట్లేదు. త్వరలో బాధితుల్ని కలుస్తా. నిజాలన్నీ బయటకు వస్తాయి. నేను తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుంటాను’ అని వ్యాఖ్యానించారు. 
 

శనివారం రాత్రి కరూర్‌లో విజయ్‌ మీట్‌ ది పీపుల్‌ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సభలో విజయ్ ప్రసంగిస్తుండగా అభిమానులు,టీవీకే కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. 

షెడ్యూల్‌ ప్రకారం .. విజయ్‌ కేఎస్‌ థియేటర్‌ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి,  జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు  కరూర్‌ నగరంలోని వేలు స్వామిపురం సభాస్థలికి చేరుకున్నారు.

దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్‌ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి  పదుల సంఖ్యలో వాటర్‌ బాటిళ్లను విజయ్‌ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)